Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

నా భార్యకు సెక్స్ అంటేనే అసహ్యమట. ఏం చేయాలి?

Telugu Sex Kathalu

Telugu Sex Stories ఇటీవలే వివాహమైంది. శోభనం రోజు నుంచే నాకు సమస్య ప్రారంభమైంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో పెళ్లికి ముందు ఇద్దరం మాట్లాడుకున్న సందర్భం లేదు. దీంతో శోభనం రాత్రి రోజున ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకున్నాం. ఆ సమయంలో సెక్స్ అంటేనే నాకు అసహ్యమని చెప్పింది. ఇది నా గుండెల్లో గునపంలా గుచ్చినట్టు అయింది. నా దాంపత్య జీవితంపై అనేక ఆశలు పెట్టుకున్నా. కానీ, నా భార్య శోభనం రోజునే ఆ మాట చెప్పడంతో ఆమెను కనీసం హగ్ కూడా చేసుకోకుండా వదిలివేశా. ఇపుడు నా పరిస్థితి ఏంటి. నేను ఏం చేయాలి.? సాధారణంగా కొత్తగా పెళ్లయిన యువతుల్లో సెక్స్ అంటే భయం గూడుకట్టుకుని ఉంటుంది. మరికొంతమంది అసలు సెక్స్ అంటేనే అసహ్యించుకుంటారు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా కొంతమంది స్త్రీలకు విముఖత చూపిస్తుంటారు. సెక్స్‌కు ఒత్తిడి తెస్తే విడాకులు కావాలని డిమాండ్ చేస్తారు. ఆమె కూడా ఈ కోవకు చెందిన మహిళే. ఆరోగ్యం, శారీరక స్పందన, భావోద్వేగాలు, అనుభవాలు, నమ్మకాలు, భార్యభర్త మధ్య సంబంధాలు, జీవనశైలి. ఇలాంటి ఎన్నో విషయాలతో స్త్రీ లైంగిక చర్య ముడిపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్త్రీలలో లైంగిక సమస్యలు పురుషులలో వచ్చినంత తరచుగా రాకపోయినా మరీ అంత అసాధారణమేమీ కాదు. లైంగిక విషయాలపట్ల చర్చిస్తే తమ గురించి ఏమనుకుంటారో అనే భయం, బిడియం వల్ల తమలో తామే కుంగిపోతుంటారు. కనీసం జీవితభాగస్వామితో కూడా చర్చించలేరు. ఒకవేళ చెప్పుకున్నా జీవితభాగస్వామి పట్టించుకోకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వంటి వాటి వల్ల ఈ సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. వీటికితోడు.. జీవిత భాగస్వామితో మనస్పర్థల వల్ల లైంగిక వాంఛలపట్ల విముఖత ఉత్పన్నమవుతుంది. ఇంటి వాతావరణం, పరిస్థితులు, ఒకరి పట్ల ఒకిరికి ఆకర్షణ ఉండకపోవడం, భాగస్వామి నుంచి తగినంత ఉత్తేజం, ప్రేరణ, ఫోర్ ప్లే లేకపోవడం వల్ల ఆసక్తి ఉండదు. కలయిక సమయంలో భావప్రాప్తి కలగకపోవడం, ఆ సమయంలో బాధ, నొప్పి రావడం. వంటి వాటి వల్ల స్త్రీ లైంగిక కార్యకలాపాల పట్ల విముఖంగా ఉంటుంది. పైగా భర్త తనను కేవలం ఆ సుఖం కోసమే ఉపయోగిస్తున్నాడన్న అపోహలో పూర్తిగా సెక్స్ అంటే కస్సుమంటుంది. దానిపట్ల అసహ్యాన్ని పెంచుకుంటుంది. కనుక వీటన్నింటికి పరిష్కారం కనుగొంటే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందని సెక్సాలజిస్టులతో పాటు మానసి వైద్యులు చెపుతున్నారు.

Telugu Sex Stories2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme