Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

ఇతరుల ముందు భార్యాభర్తల గొడవలొద్దు.. భాగస్వామిపై జాలితో..?

ఇతరుల ముందు, బహిరంగ ప్రదేశాల్లో భార్యాభర్తలు గొడవపడటం అంత మంచిది కాదంటున్నారు సైకాలజిస్టులు. దంపతుల మధ్య జగడాలు సహజమే అయితే వాటిని పబ్లిక్ ప్లేసుల్లో తెలియపరచకూడదు. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని వాటిని కూడా అంగీకరించాల్సి వస్తుంది. అలాంటప్పుడే భార్యాభర్తల మధ్య సంబంధాలు బలపడతాయి. చాలా మంది జంటలు ఏ సంబంధంలోనైనా ఇష్టం లేని విషయంపైనే పోట్లాటకు రెడీ అవుతుంటారు. అయితే మీ సమస్యలను బహిరంగంగా పరిష్కరించుకోవాలనుకోకూడదు. మీరు బహిరంగంగా ఏది మాట్లాడినా అది మీకు అప్రతిష్టపాలు అవ్వడానికి అధిక మార్గం చూపుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో జాలి, దయ గుణాలు బాగా పని చేస్తాయి. అందుచేత మీ భాగస్వామిపై జాలితో మెలగండి. ఫాస్ట్ లైఫ్‌లో మిమ్మల్ని పట్టించుకోవడం కాస్త మరిచిపోయినా ఒకరికొకరు సమస్యల్ని సృష్టించకుండా సర్దుకుపోవడం.. కష్టనష్టాలను తెలుసుకోవడం చేయాలి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య పోట్లాటకు సమయం ఉండదని సైకాలజిస్టులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme