Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

నాక్కాబోయే భార్య ప్రియుడు ఇప్పుడొచ్చాడు. బ్లాక్‌మెయిల్ చేసి ఈమెనేమైనా..?

నేను నాలుగేళ్ల క్రితం ఓ అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను. ఐతే మా పరిచయం నెల రోజుల తర్వాత ఆమె నాకు ఓ విషయం చెప్పింది. అదేమిటంటే. తను ఓ అబ్బాయి చేతిలో మోసపోయిందట. అతడు ప్రేమించానని చెప్పి ఓ రోజు ఆమెను లైంగికంగా అనుభవించి వదిలేశాడట. ఆ తర్వాత అతడు తనతో కాంటాక్ట్ తెంచేసుకుని, ఫోనుకు దొరక్కుండా సిమ్ కార్డ్ సైతం పడేశాడని చెప్పింది. ఆమె నాకు తొలిసారి పరిచయమైన వెంటనే ఈ విషయం చెప్పడంతో ఆమెపై ప్రేమ మరింత పెరిగింది. ఇద్దరం నాలుగేళ్లు గడిపేశాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఈమధ్య మేమిద్దరం పార్కులో ఉండగా ఒకతను వచ్చాడు. నా ప్రేయసిని చూసి నవ్వుతూ వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక. అతడే తనను లైంగికంగా అనుభవించిన యువకుడు అని చెప్పింది. ఆ మాట చెప్పి క్యాజువల్ అయిపోయింది. కానీ నాకు మాత్రం ఏదో గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది. నా ప్రేయసి ఇలా ఒకడి చేతిలో మోసపోయిందని తెలుసినా మా పెద్దలు ఆమెతో పెళ్లికి అంగీకరించేశారు. ఇప్పుడు మాత్రం నాకెందుకో ఆమెను పెళ్లి చేసుకోవా లంటే ఏదోగా అనిపిస్తోంది. అతడు మళ్లీ వచ్చేశాడు. ఆమెను పెళ్లాడిన తర్వాత అతడేమైనా బ్లాక్ మెయిలింగ్ చేస్తూ నా భార్యను తిరిగి అతడు అనుభవిస్తాడేమోనని భయంగా ఉంది. పెళ్లి చేసుకుంటే ఇలాంటిదేమీ జరుగదు కదా.? మీరు పెళ్లాడబోయే అమ్మాయి గతంలో జరిగినదంతా చెప్పేసింది. అతడు చేసిన మోసం ఏమిటో కూడా చెప్పేసింది. మీ పెద్దలు కూడా పెళ్లికి ఒప్పేసుకున్నారు. అందరికీ విషయం తెలుసు. ఈ పరిస్థితిలో అతడు మీకు కాబోయే భార్యను బ్లాక్ మెయిలింగ్ చేసే పరిస్థితి ఎక్కడుంటుంది. అదేమీ జరుగదు. కనుక మీరు నిశ్చితంగా ఆమెను పెళ్లి చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme