Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

నా భార్య తన సెల్ ఫోనులో తన నగ్న ఫోటో పెట్టుకుంది. ఇలా ఎందుకు చేసింది.

మా పెళ్లయి సంతోషంగా సంసారం చేసుకుంటున్నాము. ఇటీవల నా భార్య వంట గదిలో నిమగ్నమై ఉండగా బెడ్రూంలో ఆమె ఫోనును తీసి పరిశీలించాను. ఫోటో ఫైల్‌కి వెళ్లి చూస్తే ఆమె నగ్నంగా ఉన్న ఫోటో కనబడింది. ఆ ఫోటోను చూసి షాక్ తిన్నాను. ఇంకా చూడబోతూ ఉంటే ఆమె వచ్చి ఫోనును లాక్కుంది. అందులో ఏముంది అని అంటే చెప్పడంలేదు. తన నగ్న ఫోటో ఉందని ఆమె నాకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నట్లు. ఆ ఫోటోతో ఆమె ఏమయినా చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. ఆమె ఎందుకిలా చేసింది.? కొంతమందికి ఇలా తమ శరీరాన్ని నగ్నంగా చూసుకోవడంలో ఆనందం ఉంటుంది. అలాంటి వారు ఇలా ఫోటోలు తీసుకుని చూస్తుంటారు. ఈ విషయంలో మీరు అనుమానించాల్సినదేమీ లేదని గ్రహించండి. మీ సంసారం సంతోషంగా సాగుతూ ఉందని చెపుతున్నారు. ఆ ఫోటో మీరు చూసి ఉంటారని ఆమెకు తెలిసిపోయే ఉంటుంది. కాబట్టి అందులో ఏముంది అని ఆమెను కోపంగా అడిగేకంటే అలా నగ్నంగా ఫోటో ఎందుకు తీసుకున్నావని అడగండి. ఆమె ఖచ్చితంగా సమాధానమిస్తుంది. ఇకపోతే. ఇలా నగ్నంగా దిగిన ఫోటో మీ చేతిలో పడింది కాబట్టి సరిపోయింది. గబుక్కున ఎవరైనా ఆమె ఫోనును చూస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. కనుక ఆ ఫోటోను వెంటనే తొలగించమని ఆమెకు చెప్పేయండి. ఫోటో ఉంచడం వల్ల కలిగే అనర్థాలను వివరించండి. అంతేతప్ప అనుమానాలకు పోయి సమస్యను పెద్దది చేసుకోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme